ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అన్ని విధాలుగా ఆయువుపట్టుగా వున్నా మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని.. వైద్య ఉద్యోగులందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. శుక్రవారం సర్వసిద్దిలోని పీ.హెచ్.సీ ఆవరణలో 'వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ అసిస్టెంట్లు కావాలి.. పీ.హెచ్.సీ లకు రావాలి' అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఉద్యోగులందరూ పాల్గొన్నారు.