ముంచంగిపుట్టు: మాత శిశు మరణాలు నివారణకు కిల్కారి కాల్స్

63చూసినవారు
ముంచంగిపుట్టు మండలంలోని బరడ పంచాయతీ పరిధి బురిసిందిలో ఆశా కార్యకర్త మితుల నెలలు నిండిన గర్భిణీలకు బుధవారం కిల్కారి కాల్స్ పై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ గర్భిణులకు ఆరోగ్య సమాచారాన్ని చేరవేసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కిల్కారి వాయిస్ తో కూడిన సమాచారం పేరిట కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసిందన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మాతా శిశు మరణాలకు పటిష్టమైన చర్యలు చేపట్టిందన్నారు.

సంబంధిత పోస్ట్