వేపగుంట పరిధిలో సింహాచలం దేవస్థానానికి చెందిన 3.40 ఎకరాల మామిడి తోట ఉన్న భూమిపై పలువురు ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు ఈఓ త్రినాధరావు శనివారం తెలిపారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు మేరకు దేవస్థానం ప్రత్యేక న్యాయవాది నోటీసులు జారీ చేశారు. వారు వైదొలగకపోవడంతో ఆ భూమిని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు ఈఓ తెలిపారు.