అనంతగిరి: ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి: ఎంపీడీవో ఏవివి కుమార్

67చూసినవారు
అనంతగిరి: ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి: ఎంపీడీవో ఏవివి కుమార్
అల్లూరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనంతగిరి మండలంలో సోమవారం ఎంపీడీవో కుమార్ సచివాలయ సిబ్బంది, వారపు సంతలో వర్తక వ్యాపారులతో సోమవారం సమావేశమై ప్లాస్టిక్ వస్తువుల అమ్మకం, వినియోగం నిషేదించాలని సూచించారు. వ్యాపారస్తులు, ప్రజలు జూట్ తో తయారు చేసిన వస్తువులను మాత్రమే వినియోగించాలన్నారు. డిసెంబర్ ఒకటో తేదీ నుండి ప్లాస్టిక్ నిషేధం జిల్లా మొత్తం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్