అరకులోయ మండలంలోని యండపల్లివలసలో ఉన్న గురుకుల బాలికల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న జన్ని ప్రియాంక అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. కొద్ది రోజులుగా ప్రియాంక అనారోగ్యంతో బాధపడుతుండగా పరిస్థితి విషమించడంతో ప్రియాంకను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రియాంక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ వార్డెన్ నిర్లక్ష్యంతో తమ కూతురు ప్రియాంక చనిపోయిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.