బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అరకులోయ మండలంలోని రెండు రోజులుగా వర్షాలు కుమ్మేస్తున్నాయి. క్రిస్మస్ సెలవులు కావడంతో అరకు సందర్శనకు వచ్చిన వివిధ ప్రాంతాల పర్యటకులు కురుస్తున్న వర్షాలతో సందర్శన ప్రాంతాల్లో సందర్శించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాల్లో వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో గిరిజనులు భయం గుప్పెట్లో రాకపోకలు కొనసాగిస్తున్నారు.