అరకులోయ మండలంలోని మాదల గ్రామానికి వెళ్లే తారురోడ్డుకి మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 5 సంవత్సరాల క్రితం నిర్మించిన తారు రోడ్డు పలుచోట్ల శిథిలావస్థకు చేరి గోతులు ఏర్పడి వాహనచోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మాదల గ్రామ గిరిజనులు తెలిపారు. అధికారులు స్పందించి గోతులు ఏర్పడిన తారు రోడ్డుకి మరమ్మత్తులు చేపట్టాలని మాదల గ్రామ గిరిజనులు మంగళవారం కోరారు.