అరకు: చిట్టంగొందికి తారు రోడ్డు నిర్మించాలని వినతి

85చూసినవారు
అరకులోయ మండలంలోని మాదల పంచాయతీ పరిధి చిట్టంగొందికి తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది క్రితం తారురోడ్డు నిర్మాణ పనులు చేపట్టి విడిచి పెట్టేయడంతో ఉన్న మట్టి రోడ్డు ఏటా వర్షాకాలంలో బురదమయంగా తయారవుతుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు సోమవారం తెలిపారు. అధికారులు స్పందించి చిట్టంగొందికి తారురోడ్డు నిర్మించి తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్