పీఎం జన్మన్ పథకం ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారి ఈశ్వరరావు అన్నారు. బుధవారం జి. మాడుగుల మండలంలోని బొయితెలి పంచాయితీ పరిధి మండిబా చదురుమామిడి గ్రామాల్లో పీఎం జన్మన్ పథకం ద్వారా పివిటిజి గిరిజనులు నిర్మించుకుంటున్న గృహాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క గృహానికి రూ. 2. లక్షల 30 వేలుకు కేంద్ర ప్రభుత్వం పెంచిందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.