ముంచంగిపుట్టు మండలంలో విషాదం చోటు చేసుకోంది. మండలంలోని రంగబయలు పంచాయతీలోని చంపపుట్టుకి చెందిన వంతల. పూర్తిమ్మ అనే ఆశా కార్యకర్త గురువారం కడుపు నొప్పితో బాధపడుతూ ఆకస్మికంగా తుదిశ్వాస విడిచింది. దీనితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ భర్త దేవా, స్థానిక సర్పంచ్ ధన్య మృతురాలు ఆశా కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలుపుతూ ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.