అనంతగిరి మండలంలోని వేంగాడ పంచాయతీలోని గోమంగిపాడుకి తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల గోమంగిపాడుకి మట్టిరోడ్డు నిర్మించారు. ఫెంగాల్ తుపాన్ కారణంగా రెండు రోజులుగా కురిసిన భారీవర్షానికి ఉన్న మట్టిరోడ్డు బుధవారం బురదమయం కావడంతో గోమంగిపాడు గిరిజనులు వేంగడ జంక్షన్ నుంచి ఆటోను అతికష్టం మీద గోమంగిపాడుకి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి తారురోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.