అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల రామాలయం వీధిలోని రామాలయం ఆవరణలో డిసెంబర్ 20, శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఆదివాసి స్వయంపాలన సదస్సు జరుగుతుంది. ఈ సదస్సును విజయవంతం చేయేందుకు ఆదివాసి ప్రజలందరూ పాల్గొనాలని డీఎల్వో ఉపాధ్యక్షుడు కొర్రా ప్రసన్నకుమార్ పిలుపునిచ్చారు. 5వ షెడ్యూల్, 1/70 యాక్ట్ చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయన కోరారు.