హుకుంపేట: 40 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

59చూసినవారు
హుకుంపేట: 40 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలోని హుకుంపేట గ్రామంలో రూ. 2 లక్షల నిధులతో 40 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి అరకు ఎమ్మెల్యే రేగం. మత్స్యలింగం పాల్గొని కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. సిసి రోడ్డు నిర్మాణంతో హుకుంపేట గిరిజనుల సిసి రోడ్డు కష్టాలు తీరనుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూర్ణిమ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్