సంక్రాంతి పండగ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది భోగి మంటలు గాలిపటాలు పిండి వంటలు హరిదాసుల పాటలు తెలుగు నాట సంక్రాంతి పండుగకు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. పెదబయలు మండలంలోని గుల్లెలులో గిరిజనులు సోమవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించి భోగి మంటలు వేసి సందడి చేశారు. అనంతరం సోమవారం రాత్రి ఇటీవల సర్పంచ్ సత్యాలమ్మ చేతుల మీదుగా ప్రారంభించిన రచ్చబండ వద్ద చిన్నారులు నృత్యాలు ప్రదర్శించి అలరించారు.