ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన గ్రామ వాలంటీర్లను తిరిగి విధుల్లో తీసుకోవాలని పెదబయలు మండల కేంద్రంలో వారు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. సీఐటీయూ మద్దతుతో కొనసాగుతున్న ఈ దీక్షలో వేతనాలు లేక పస్తులు ఉండాల్సి వస్తోందని వాలంటీర్లు మండల కేంద్రంలో గల దుకాణాలలో భిక్షాటన చేశారు. తమను విధుల్లో తీసుకొని 7 నెలల బకాయి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.