కొయ్యూరు మండల సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 11న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మేరీ రోజ్ బుధవారం తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షుడు బడుగు రమేష్ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశానికి జడ్పిటిసి మండలంలో గల 33 పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు హాజరు కావాలని కోరారు. అలాగే మండలంలో గల అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి సమాచారంతో విధిగా హాజరు కావాలన్నారు.