పెదబయలు మండలంలోని సీతగుంట పంచాయతీలోని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాంగి. రాజారావు ఆధ్వర్యంలో బుధవారం 77వ బూత్ కమిటీ ఎన్నిక జరిగింది. పంచాయతీ బూత్ అధ్యక్షుడుగా పాంగి. దేవన్నను ఏకగ్రీవంగా ఎన్నుకోగా 12 మందితో కూడిన సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షుడు రాజారావు మాట్లాడుతూ రాబోయే పంచాయితీ సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు నాయకులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.