పొంగిన కొండ వాగు.. రాకపోకలకు గిరిజనులు ఇబ్బందులు

3665చూసినవారు
అనంతగిరి మండలంలోని గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురుస్తున్న భారీ వర్షానికి పెదకోట పంచాయతీ పరిధి జాలడ సమీపంలోని కుడియాకు వెళ్లే రహదారిపై కొండ వాగు పొంగి వరద నీరు ప్రవహిస్తుంది. దీనితో గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా వర్షాకాలంలో ఈ రహదారిపై వాగుపొంగి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు కళ్యాణ్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై అధికారులు స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్