తగరపు వలస లోని అంబేడ్కరు కూడలి నుంచి కొండపేటకు వెళ్లే మార్గంలో మద్యం దుకాణాలను తొలగించాలని స్థానికులు భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించారు. ఆదివారం కొండపేట వాసులు బలవంతంగా మద్యం దుకాణాలను మూయించి వేశారు. గతంలో ప్రభుత్వ మద్యం దుకాణం మాత్రమే ఉండేదన్నారు. ప్రస్తుతం మరో మద్యం దుకాణం రావడంతో పాటు పాత మద్యం దుకాణంలో కూడా విక్రయాలు జరుపుతున్నారని దింతో మద్యం బాబులు రెచ్చిపోతున్నారన్నారు.