భీమిలి: సమస్యల పరిష్కారం కోసం మత్స్యకారుల రిలే దీక్షలు

73చూసినవారు
భీమిలి: సమస్యల పరిష్కారం కోసం మత్స్యకారుల రిలే దీక్షలు
అడ్డు అదుపులేని కాలుష్య పరిశ్రమలు కబ్జాదారుల మధ్య మత్స్యకారుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయని మత్స్యకారుల నాయకుడు గంటా నూకరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం భీమిలి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 8వ రోజుకు చేరుకున్నాయి. కాలుష్య పరిశ్రమలు వదులుతున్న రసాయనిక వ్యర్థ జలాలతో మత్స్య పరిశ్రమ కుదేలైందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్