ఆనందపురం మండలం గొట్టిపల్లి గ్రామంలో బుధవారం నాడు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో 78 మీటర్ల జాతీయ జెండాతో హై స్కూల్ విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో గ్రామ కార్యదర్శి సురేష్ బాబు, హై స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం అప్పారావు మాజీ సర్పంచ్ కోరాడ నాయుడు బాబు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.