హౌసింగ్ బోర్డ్ చైర్మన్ తాతయ్య బాబును సన్మానించిన రమేష్ యాదవ్

78చూసినవారు
హౌసింగ్ బోర్డ్ చైర్మన్ తాతయ్య బాబును సన్మానించిన రమేష్ యాదవ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా నియమించబడిన అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబును బుచ్చయ్యపేట మండలం యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు సింగంపల్లి రమేష్ యాదవ్ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేసిన తాతయ్య బాబుకు పదవి దక్కటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్