బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్ట, పి. భీమవరం మధ్యలో వెలిసిన శ్రీశ్రీశ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో మొదటి వార్షికోత్సవ సందర్భంగా మహా అన్న సమారాధన కార్యక్రమం తమరాన దాసు మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజాము నుంచి వేద పండితులతో రుద్రాక్ష హోమంలో 20 జంటలు కూర్చుని శివునికి ప్రత్యేక పూజలు జరిపారు. అన్న సమారాధన కార్యక్రమానికి 6000 పైగా జనాభా వచ్చారు.