చోడవరం.. ఘనంగా లక్ష్మీ గణపతి హోమం

84చూసినవారు
చోడవరం.. ఘనంగా లక్ష్మీ గణపతి హోమం
చోడవరం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో అశ్వియుజ బహుళ చవితి సంకట హర చతుర్థి సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామి వారి సన్నిధిలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం ఘనంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి చలపతి ఆధ్వర్యంలో అర్చక బృందం హోమాన్ని నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి పంచామృతాభిషేకం చేపట్టారు. అనేక మంది భక్తులు పాల్గొని హోమాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్