చట్టాల లో మార్పులు తేవాలి

64చూసినవారు
చట్టాల్లో మార్పులు చేసి కిరాతకులను అత్యంత కఠినంగా శిక్షించాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. ఈనెల 9వ తేదీన కలకత్తాలో లేడీ డాక్టర్ ని అత్యంత కిరాతకంగా చంపిన వారిపై చర్యలు చేపట్టాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శనివారం చోడవరంలో బంద్ పాటించి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఆ సంఘ ప్రతినిధులు డాక్టర్ బండారు సత్యనారాయణమూర్తి తదితరులు మాట్లాడుతూ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్