విశాఖ పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ వద్ద కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 53వ రోజుకు చేరుకున్నాయి. సిఐటియు అధ్యక్షులు జే సత్యనారాయణ మాట్లాడుతూ ప్రైవేట్ కు ఇచ్చేందుకు పిలిచిన టెండర్లను రద్దు చేయాలన్నారు. 40 వేల మందికి సేవలు అందిస్తున్న పోర్టు హాస్పిటల్ ను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.