వీఎంఆర్డీఏ పార్క్ లో వీఎంఆర్డీఏ, థాన్ ఫౌండేషన్ నిర్వహణలో షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల తట్టుకుని నిలిచే విధముగా సుమారు 1200 మొక్కలను1. 5 ఎకరాల విస్తీర్ణంలో నాటే కార్యక్రమాన్ని విశాఖ జిల్లా కలెక్టరు హరీంద్ర ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, సంస్థ ఛైర్ పర్సన్ ప్రణవ్ గోపాల్, కమీషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు.