విశాఖ డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 21న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఐ. విజయబాబు తెలిపారు. శనివారం ఉదయం 9:30 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. టాటా గ్రూప్, విప్రో, టెక్ మహీంద్రా, అమెజాన్ తదితర కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి.