చోడవరం పట్టణ ప్రజలు క్రిస్మస్, సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్తున్న వారు జాగ్రత్త పాటించాలని చోడవరం సిఐ అప్పలరాజు సూచించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండగలకు ఊరెళుతున్నవారు తమకు సమాచారం ఇస్తే ఆ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేస్తామని వివరించారు. బైకులు ఎక్కడబడితే అక్కడ పార్కు చేస్తే చోరీకి గురై అవకాశం ఉందని.. వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.