మాడుగుల స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని (సిడిపిఓ) సిహెచ్ శ్రీదేవి కి 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లాలోని ఉత్తమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిగా ఎంపిక చేసి జిల్లా కలెక్టర్, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ, సీఎం రమేష్ చేతుల మీదుగా, ఉత్తమ అవార్డు అందుకున్నారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు.