విశాఖలో న్యాయ విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గురువారం నర్సీపట్నంలో ఎస్ఎఫ్ఎ, ఐద్వా, డీవైఎఫ్ఎ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అబీద్ సెంటర్లో మానవహారం చేశారు. ఎస్ఎఫ్ఎ డివిజన్ కార్యదర్శి జనార్ధన్ మాట్లాడుతూ విద్యార్థినులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.