కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆదివారం నాతవరం మండలం చెర్లోపాలెంలో నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. స్పీకర్ మాట్లాడుతూ అధికారం చేపట్టిన 100 రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.