సీఎం చంద్రబాబు ఈ నెల 4వ తేదీన విశాఖ రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని.. ఆర్కేబీచ్‌లో తూర్పు నౌకాదళం విన్యాసాలు తిలకిస్తారు. సాయంత్రం 6. 45 గంటలకు నేవీ అధికారులు ఇచ్చే విందుకు హాజరవుతారు. అదే రోజు విమానంలో విజయవాడకు తిరుగు పయనమవుతారని గురువారం విశాఖ కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈమేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సీఎంకు ఘన స్వాగతం పలకనున్నామన్నారు.