నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విశాఖ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా ఆర్టీసీ డిపిటీవో వైఖరిపై చర్యలు తీసుకోవాలని గాజువాక, విశాఖ ఉత్తర ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజుకు ఆదివారం వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. 43 రోజులుగా వాల్తేర్ డిపోలో నిరసనలు తెలుపుతున్నప్పటికీ యాజమాన్యం స్పందించక పోవటంతో దారుణమని వారికి వివరించారు.