రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో మంగళవారం నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర మేయర్ మాట్లాడుతూ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే సిరిసంపదలతో పాటు సకల పాపాలు నశించడమే కాకుండా మానసిక ప్రశాంతత ఆరోగ్యం సమకూరుతాయని తెలిపారు.