విశాఖ జెడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్రకు పోలీస్ భద్రతను తొలగించారు. మావోయిస్టు ప్రాబల్యం గల అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలానికి చెందిన సుభద్రకు నిబంధనల ప్రకారం భద్రత కల్పించాల్సి ఉంది. గన్ మెన్‌లు లేకుండా శుక్రవారం ఆమె విశాఖ జడ్పీ కార్యాలయానికి వచ్చారు. భద్రత లేకుండా వచ్చిన ఆమెను ప్రశ్నించగా కూటమి ప్రభుత్వం భద్రత తొలగించినట్లు తెలిపారు. భద్రత కల్పించాలని డిజిపికి లేఖ రాసిన స్పందన లేదని ఆమె తెలిపారు