శిక్ష సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా గురువారం కోటవురట్ల మండలం కె. వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సాంప్రదాయ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిడతలు పట్టుకొని కోలాటం ఆడారు. హెచ్ఎం షేక్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ అలనాటి సాంప్రదాయ నృత్యాలు విద్యార్థులకు వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.