నక్కపల్లి మండలం పెదతీనార్ల గ్రామంలో ఐదు లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు ఎంపీటీసీ ఎం. నాగేశ్వరరావు తెలిపారు. ఒక కిలోమీటర్ పొడవునా రహదారిని నిర్మిస్తున్నామన్నారు. నాలుగు రోజుల్లో రోడ్డు నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. ఎం నూకరాజు ఇంటి వద్ద నుంచి స్మశానం వరకు రహదారిని నిర్మిస్తున్నామన్నారు.