పాయకరావుపేట నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికలకు కూటమి శ్రేణులు సిద్ధంగా ఉండాలని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, జనసేన నియోజకవర్గం సమన్వయకర్త గెడ్డం బుజ్జి సూచించారు. పాయకరావుపేటలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరినీ గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.