సింహాచలం సింహాద్రి అప్పన్నను ప్రముఖ సినీ హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ మర్యాదల మేరకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. సింహాద్రి అప్పన్నకు విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్ధప్రసాదాలు అందజేశారు.