పెందుర్తి: 97వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే

66చూసినవారు
పెందుర్తి: 97వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే
సమస్యలు తెలుసుకోవడానికి వార్డుల్లో పర్యటిస్తున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. గురువారం ఉదయం పెందుర్తి మండలం 97వ వార్డు చినముషిడివాడ ప్రాంతంలో పర్యటించి ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన రహదారులు కల్వర్టులు, పార్కుల అభివృద్ధిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ వసంత ఉన్నారు.

సంబంధిత పోస్ట్