ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని సింహాచలం సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవాన్ని బుధవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా గోవిందరాజు స్వామిని అలంకరించి వాహనంలో అధిష్టింప చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పలువురు స్వామిని దర్శించుకున్నారు.