విశాఖ శ్రీ శారద పీఠంలో మట్టి వినాయక ప్రతిమలను శుక్రవారం పంపిణీ చేశారు. వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా జరుపుకోవాలని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి భక్తులకు విజ్ఞప్తి చేశారు. పూజలో మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలని స్వామి పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులు అందరిపైన ఉండాలని స్వామి ఆకాంక్షించారు.