రంపచోడవరం మండలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బుధవారం సూపరింటెండెంట్ కె. లక్ష్మీ డయేరియాపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, తల్లులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవిధమైన మందులు వాడాలో చెప్పడం జరిగింది. హాస్పిటల్ లో అందించే వైద్య సేవలు, నివారణకు మార్గాలను పేడియాట్రీషియన్ ఆదిలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కౌన్సిలర్, తదితరులు పాల్గొన్నారు.