మల్లవరంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

70చూసినవారు
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని అడ్డతీగల మండలంలోని మల్లవరంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి అరకు పార్లమెంట్ కన్వీనర్ భారతి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిందన్నారు. ఆగస్టు 15న వరకూ ప్రతి ఇంట్లో భారత జెండా ఎగరాలని జెండా యొక్క విశిష్టత గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులున్నారు.

సంబంధిత పోస్ట్