రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కుంట ఏరియా కమిటీ సభ్యుడు ఎం. మంగ మంగళవారం పోలీసుల ముందు లొంగిపోయినట్లు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. మంగ 2018 నుంచి మావోయిస్టు దళంలో పని చేస్తూ పలు హింసాయుత సంఘటనల్లో పాల్గొన్నాడని తెలిపారు. మావోయిస్ట్ కార్య కలాపాల పట్ల విసుగు చెంది జనజీవన స్రవంతిలో కలిశాడని పేర్కొన్నారు. పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.