రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 65 వినతులు వచ్చాయని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం జివిఎంసి ప్రధాన కార్యాలయంలో వినతులను జివిఎంసి అదనపు కమీషనరు డి. వి. రమణమూర్తి తో కలిసి ఆమె స్వీకరించారు. రమణమూర్తి మాట్లాడుతూ ఫిర్యాదులను సంబంధిత శాఖలకు రిఫర్ చేశామన్నారు. మూడు రోజుల్లోగా వీటిని పరిష్కరించాలని ఆదేశించారు.