విశాఖలో పర్యటిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు గరువారం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి ప్రజలు తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, ఇతర వర్గాలు లోకేష్‌ను కలిసి సమస్యలు విన్నవించుకున్నారు.