ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో భాగంగా ప్రజల నుంచి వచ్చే వినతులకు పరిష్కారం చూపడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలు అందించే వినతులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు ప్రజల నుంచి వివిధ సమస్యలపై 120 వినతులు అందాయి.