విశాఖ: మహిళల పై హింసని అరికట్టాలి- ఐద్వా
అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) మల్కాపురం జోన్ కమిటీ ఆద్వర్యంలో మంగళవారం మహిళలపై హింస అరికట్టాలి! పరిష్కారా మార్గాలు సదస్సు వెంకన్న పాలెం సిఐటియు ఆఫీసులో నిర్వహించారు. ఐద్వా విశాఖ జిల్లా కార్యదర్శి వై. సత్యవతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించాలి, మహిళా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదస్సు అనంతరం మల్కాపురం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.